న్యూఢల్లీి,అక్టోబర్1 (ఆంధ్రపత్రిక): సాంకేతిక రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో 5జీ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు.నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మోబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతున్న దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటు లోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్లలో యావత్ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. 5జీ సేవలను ప్రారంభిస్తున్న మోదీ5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు. అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు. 2035 నాటికి భారత్‌ను 450 బిలియన్డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. 5జీతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్ఇండియా విజన్‌ను చేరుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. అయితే దివాళీ నుంచి యూజర్లు 5జీ సేవలను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్టెల్, రిలయన్స్ జియో, క్వాల్కమ్ కంపెనీలు తమ 5జీ సేవల గురించి ప్రధాని మోదీకి వివరించాయి. ఆకాశ్ అంబానీ 5జీ గురించి ప్రధానికి డెమో ఇచ్చారు. ప్రధాని మోదీ 5జీ సేవల్ని ప్రారంభించడం చరిత్రాత్మకమని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టెలికాం చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు. డిజిటల్ ఇండియాకు ఇది ఫౌండేషన్‌గా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవల్ని చేరవేయడంలో 5జీ ఉపకరిస్తుందని మంత్రి వైష్ణవ్ వెల్లడిరచారు.5జీ సేవలను ప్రారంభించడం పట్ల గర్వంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. టెలికాం రంగంలో నాయకత్వ పాత్రను పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక నుంచి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ .. ఆసియా మొబైల్ కాంగ్రెస్ కావాలని, అదే గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్‌గా అవతరలించాలని ముఖేశ్ వెల్లడిరచారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ కన్నా 5జీ ఎంతో కీలకమైందన్నారు. 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, మెటా వర్స్ లాంటి టెక్నాలజీలకు 5జీ టెక్నాలజీ ఏమాత్రం తీసిపోదన్నారు. ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని భారతి సంస్థ చైర్మన్ సునిల్ భారతి మిట్టల్ తెలిపారు. ఓ కొత్త యుగం ప్రారంభంకానున్నదని, 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఇది జరగడం శుభదాయకమని, 5జీతో ప్రజలకు అనేక కొత్త అవకాశాలు వస్తాయని సునిల్ మిట్టల్ తెలిపారు. చైనా తర్వాత స్మార్ట్ఫోన్లకు అతిపెద్ద మార్కెటుగా ఉన్న భారత్‌లో 5జీ రాక.. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. భారత్‌పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2035 నాటికి సుమారు రూ.36 లక్షల కోట్లకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత 4జీతో పోలిస్తే 7నుంచి 10 రెట్ల డేటా వేగం.. 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్టమ్ర్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88వేల 78 కోట్లు, ఎయిర్టెల్ రూ.43వేల 84 కోట్లు, వొడాఫోన్ ఐడియా 18వేల 799 కోట్ల విలువైన స్పెక్టమ్ర్‌ను కొనుగోలు చేశాయి. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమయ్యాయి. భారత్‌లోనూ ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వచ్చే రెండేళ్ల యావత్ దేశానికి దానిని విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా టెలికం రంగంలోని 1జీ నుంచి 4జీ దాకా ప్రతిసారీ నెట్వర్క్ సదుపాయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. 5జీలో మాత్రం దేశీయంగా ఉత్పత్తిచేసిన పరికరాలనే వాడుతున్నారు. అధికారికంగా ప్రకటించకున్నా.. 4జీ ఖర్చులతో పోలిస్తే 5జీ ఖర్చులు భారీగా ఉండకపోవచ్చని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు. కానీ డేటా వేగం పెరుగుతున్న కారణంగా వినియోగదారులు 5జీలో అధికంగా డేటాను వినియోగించే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా టెలికం కంపెనీలకు ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఫలితంగా ఛార్జీలు పెంచకున్నా, కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!