నేడు ప్రారంభించనున్న ప్రదాని మోడీ
న్యూఢల్లీి,సెప్టెంబర్30 (ఆంధ్రపత్రిక): దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటు లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. శనివారం.. ప్రధాని నరేంద్రమోదీ చేతులు విూదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లో తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. దిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ఆరో విడత ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్లలో యావత్ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. 2035 నాటికి భారత్‌ను 450 బిలియన్డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 5ఉతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్ఇండియా విజన్‌ను చేరుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. చైనా తర్వాత స్మార్ట్ఫోన్లకు అతిపెద్ద మార్కెటుగా ఉన్న భారత్‌లో 5జీ రాక.. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.