అమరావతి,సెప్టెంబర్28(ఆంధ్రపత్రిక): అన్నమయ్య ప్రాజెక్టులో కొట్టుకుపోయిన వ్యవహారంలో ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు వేసిన పిటిషన్పై న్యాయవాది గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. అయితే రైతులకు, మునిగిపోయిన గృహాలకు పరిహారం ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని న్యాయవాది గోపాలకృష్ణ పేర్కొంటూ.. రైతులు, ఇళ్ల యజమానుల జాబితాను న్యాయస్థానానికి అందించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. పరిహారంపై పూర్తిస్థాయి ఆఫిడవిట్ వేయాలని న్యాయవాది గోపాలకృష్ణను ఆదేశించింది. అలాగే ప్రభుత్వం కూడా నష్టపరిహార జాబితాను మరోసారి పరిశీలించాలని సూచిస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!