విజయవాడ, సెప్టెంబర్ 27 (ఆంధ్రపత్రిక): రెండవ రోజు మంగళవారం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలోను అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను పరవశింపచేసారు. ఇంద్రకీలాద్రిపై ఉదయం సమయాల్లోనూ సాయంకాల సమయాల్లోనూ భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఏ కొద్దిపాటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు స్వయంగా క్యూ లైన్ లను పరిశీలించి భక్తులకు కలిగే అసౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు బాగున్నాయని ఏవిధమైన ఇబ్బందులు లేవని పలువురు భక్తులు కలెక్టర్ కు బదులిచ్చారు. వృద్దులకు, చిన్నపిల్లలకు పాలు సరఫరా సౌకర్యం, వికలాంగుల కోసం వీల్ చైర్ లు ఏర్పాటు వంటి సౌకర్యాలను పర్యవేక్షించడంతో పాటు కలెక్టర్ ఛాంబర్ నుండి ఇంద్రకీలాద్రి పర్వతం పరిసర ప్రాంతాలతో సహా సి.సి. కెమెరాలతో మానిటరింగ్ సిస్టమ్ ను స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్ లలో బారికేడింగ్ ను కలుపుతూ బిగించిన ఇనుప తీగలను పరిశీలించి క్యూ లైన్ ల ద్వారా వెళ్లే భక్తుల చేతులకు తగిలి ప్రమాదం ఏర్పడవచ్చని గ్రహించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఆయా ఇనుప తీగలను విప్పించి క్లాత్ ద్వారా బారికేడింగ్ ను కట్టేలా సంబంధిత అధికారులను ఆదేశించియున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది ఇనుప తీగలను తీసి అదేస్థానంలో క్లాత్ తో బిగించి కట్టడం జరిగింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!