విజయవాడ సెంట్రల్, సెప్టెంబరు 26, (ఆంధ్రపత్రిక): కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారి దర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు దుర్గగుడి ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ హరిచందన్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గే దుర్గతి నాశని, అమ్మవారిని దర్శించుకుంటే దారిద్రములు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!