- శ్వేతపత్రం విడుదల చేస్తామన్న టీటీడీ చైర్మన్
- బోర్డు సమావేశంలో పలుకీలక నిర్ణయాలు
- మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రాధాన్యత
- 27 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల
- రూ.95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం,
- రూ. 30కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం
తిరుమల,సెప్టెంబర్24(ఆంధ్రపత్రిక): టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లు అని టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. శనివారం టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల బ్రేక్ దర్శనాల సమయంలో మార్పు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడిరచారు. బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీజేస్తామని పేర్కొన్నారు. రూ.95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం,రూ. 30కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసా యం ద్వారా పండిరచిన వాటినే వినియోగించాలని నిర్ణయించా మని అన్నారు. రూ.2.45 కోట్లతో నందకం అతిథి గృహంలో ఫర్నిచర్,రూ. 3కోట్లతో నెల్లూరులో కల్యాణ మండపాల దగ్గర ఆలయం నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిరచిన వాటినే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించాలని టీటీడీ పాలకమండలిలో నిర్ణయించినట్లు తెలిపారు. రూ.95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మిస్తామని, రూ.30 కోట్లతో చేర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రహదారి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రూ.2.45 కోట్లతో నందకం గెస్ట్‌హౌస్‌కు ఫర్నిచర్‌కు కల్పిస్తామన్నారు. క్లాస్ 4 ఉద్యోగుల యూనిఫామ్స్ కోసం రూ.2.5 కోట్లు కేటాయిస్తామన్నారు. వడమాలపేట దగ్గర భవిష్యత్ అవసరాల దృష్యా 130 ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. తిరుపతిలో కూడా వసతి గృహాల కేటాయింపు పక్రియ ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడిరచారు.