అమరావతి,సెప్టెంబర్ 24 (ఆంధ్రపత్రిక): ది.24.09.2022 తేదిన ఆంధ్ర ప్రదేశ్, అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డా|| జి. సతీష్ రెడ్డి, (సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రి, మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ , గవర్నమెంట్ అఫ్ ఇండియా) మరియు గౌరవ అతిధులుగా సుమన్ రుద్రా (విపి-హెచ్ ఆర్ , బైజూస్, బెంగళూరు), కృష్ణ పాకాల (అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ – ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ , కాగ్నిజెంట్, హైదరాబాద్) అండ్ విఐటి విశ్వవిద్యాలయ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిధి డా|| జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు జీవితంలో విజయం సాధించేందుకు పెద్దగా ఆలోచించాలన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల గురించి వివరించారు. భారతదేశాన్ని సాంకేతికంగా స్వయం సమృద్ధిగా మార్చడానికి భవిష్యత్ సాంకేతికతలలో పని చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.
గౌరవ అతిధి సుమన్ రుద్రా మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచం గురించి వివరిస్తూ, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
గౌరవ అతిధి కృష్ణ పాకాల మాట్లాడుతూ విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదుగుతూ, ఉన్నతమైన మానవతా విలువలు కలిగి ఉండాలన్నారు.
విఐటి ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ మాట్లాడుతూ విద్యలో ప్రాముఖ్యత యొక్క ఆవశ్యకతను వివరించారు. విద్యను అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు, భారతదేశం విద్యపై చాలా తక్కువ ఖర్చు చేస్తుందని, భారతదేశం తన జిడిపిలో కేవలం 3.5% మాత్రమే విద్య కోసం వెచ్చిస్తోంది మరియు ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించటానికి మార్పులు తీసుకురావాలని తెలియచేసారు. అవుట్ లుక్ ఐకేర్ ర్యాంకింగ్స్ – 2022 లో ఎమర్జింగ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కేటగిరిలో విఐటి-ఏపి విశ్వవిద్యాలయం భారతదేశం లోనే మొదటి ర్యాంక్ సాధించటం ఆనందంగా ఉందని అన్నారు. విద్యను నేర్చుకోవటాని మౌలిక సదుపాయాల కల్పనా కూడా ముక్యమని, విఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించటంలో ఎల్లప్పుడూ రాజి పడదని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ స్నాతకోత్సవంలో క్లాస్ అఫ్ 2022 చెందిన 887 మంది పట్టభద్రులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు మరియు 10 మంది బంగారు పతకాలు మరియు 66 మంది ర్యాంకులు సాధించారు.
పి.హెచ్.డి – 7
ఎం.టెక్(విఎల్ఎస్ఐ) – 7
ఎం.టెక్(5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ) – 139
బి.టెక్ (కంప్యూటర్ సైన్సు) – 264
బి.టెక్ (కంప్యూటర్ సైన్సు – డేటా అనలిటిక్స్) – 147
బి.టెక్ (కంప్యూటర్ సైన్సు – నెట్వర్కింగ్ సెక్యూరిటీ) – 118
బి.టెక్ (ఎలాక్ట్రోనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) – 96
బి.టెక్ (ఎలాక్ట్రోనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్) – 20
బి.టెక్ (ఎలాక్ట్రోనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ విఎల్ఎస్ఐ) – 24
బి.టెక్ (మెకానికల్ ఇంజనీరింగ్ )– 39
బిబిఏ – 26