ప్రకాశం, సెప్టెంబర్ 24 (ఆంధ్రపత్రిక): ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచీలు విద్యార్థులకు ఎంబెడెడ్ డివిజన్ లో బంగారు భవిష్యత్తు ఉంటుందని స్మార్ట్ ఎంబెడెడ్ కంపెనీ CEO దీపక్ కుమార్ వెల్లడించారు. శనివారం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో కంపెనీ నిర్వహించిన అవగాహన సదస్సులో 3-4 సంవత్సరాల E.C.E విద్యార్థులు పాల్గొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో కంటే ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు ఎంబెడెడ్ లాంటి కోర్సుల ద్వారా అత్యున్నత వేతనాలు లభిస్తున్నాయన్నారు. ఫైనల్ ఇయర్ లో కనీసం పరిజ్ఞానం ఉన్నా 8-10 లక్షల వేతనాలతో ఎంబెడెడ్ రంగంలో ఉద్యోగాలకు అవకాశం ఉందని దీపక్ వివరించారు.
కరస్పాండెంట్ కంచర్ల రామయ్య మాట్లాడుతూ ప్రకాశం విద్యార్థులను అన్ని రంగాల్లో సాంకేతికంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా రంగాల్లో నిష్ణోతులతో వర్క్ షాప్ లు, అవగాహన సదస్సులు, సెమినార్ల నిర్వహణ ద్వారా విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం లక్ష్యమన్నారు.ఎన్నో వ్యేయ ప్రయాసలతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా చిత్తశుద్ధిని ప్రదర్శించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఎంబాడెడ్ స్మార్ట్ కంపెనీ సీనియర్ ఇంజనీరు రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఎంబెడెడ్ లో కనీస స్థాయి నాలెడ్జ్ ఉన్న విద్యార్థులకు వారి బయోడేటా తోనే సువర్ణ అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
మరో ఇంజనీరు రవి చరణ్ మాట్లాడుతూ ప్రకాశం విద్యార్థుల ఆసక్తిని గమనిస్తే ఎంబెడెడ్ వైపు దృష్టి సారిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాజమాన్యం- విద్యార్థులు కంపెనీ C.E.O దీపక్ కుమార్ ను, ఇంజనీర్లు రామాంజనేయరెడ్డి, రవి చరణలను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.