రేణిగుంట సెప్టెంబర్ 23, (ఆంధ్ర పత్రిక): రాష్ట్ర బిజెపి నాయకులారా అభివృద్ధి సంక్షేమం మీ కంటికి మాత్రం కనబడడం లేదా, రేణిగుంట బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద నిలబడి మాట్లాడుతున్న నాయకులారా మీరు నిలుచున్న చోట ఈ మధ్యనే సిసి రోడ్ 70 లక్షల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యే నిధుల ద్వారా వేయించినవే, నేను అడుగుతున్నాను సూటిగా మీ వరకు ఎమ్మెల్యే అవసరం లేదు నేనొక్కడినే చాలు అంటూ వైకాపా యువ నేత సర్పంచ్ సిద్ధపరెడ్డి మునిశేఖర్ రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు మూడు సంవత్సరాల నాలుగు నెలలు కావస్తుంది. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు పెండింగ్ లో ఉన్న విషయం, మీకు తెలియదా! ఏదో మాట్లాడాలి అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలి. అంతేతప్ప రాజకీయ లబ్ధి కోణంలో మాట్లాడడమే మాత్రమే మీకు తెలుసనీ, మీ కంటికి అభివృద్ధి సంక్షేమం శూన్యంగా కనబడతా ఉందా అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలను ప్రశ్నించారు.
అయ్యా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేద ప్రజలకు ఇప్పటివరకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి పంపి చేయూతనిచ్చింది మీకు కనబడలేదా రాష్ట్ర నాయకుల్లారా ఇదే ప్రశ్నలను గతంలో చంద్రబాబుతో కలిసి జతకట్టిన మీకు ఆరోజు అభివృద్ధి పైన సంక్షేమం పైన కళ్ళు కనపడలేదా! రాష్ట్ర ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ వైపు ఉన్నారన్న విషయం మీరు తెలుసుకోవాలి. మంచి పని చేసిన ప్రతిసారి అందులో చెడు చూస్తున్నారా తప్ప మంచి అని మీ నోట్లో ఏమైనా మాట వచ్చిందా అంటూ విరుచుకుపడ్డారు సర్పంచ్ సిద్ధపరెడ్డి మునిశేఖర్ రెడ్డి.
అయ్యా సోము వీర్రాజు గారు మీరు మాట్లాడుతున్నారు లిక్కర్ గురించి బిజెపి పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదా ఆంధ్ర రాష్ట్రం పైనే మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో 200 బ్రాండ్ల లిక్కర్లను పరిచయం చేయలేదా ఈ విషయం మీకు తెలియదా!
మా శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి ప్రతిక్షణం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న వ్యక్తిని మీరు మాట్లాడడం భావ్యం కాదు.. అడుగుతున్నాను ఇదే ఇసుక దందాను చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే కృష్ణా నది ఒడ్డున ఇసుకను బెంగుళూరు చెన్నైకి తరలిచ్చినప్పుడు మీ కంటికి, కనబడలేదా! మీ చెవికి వినపడలేదా అంటూ దుయ్యబట్టారు సర్పంచ్.
అయ్యా సోము వీర్రాజు గారు మీరేమో బీజేపీ జనసేన కలిసి పనిచేస్తుందంటారు. పవన్ కళ్యాణ్ ఏమో జనసేన సింగిల్ గా పోటీ చేస్తుందనీ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని ఆయన అంటారు. జనసేన ని బహిరంగంగా మీడియా సమక్షంలో ఎన్నోసార్లు చెప్పిన విషయం మీకు గుర్తుకు రాలేదా! నేనడుగుతున్నాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అంటున్నావు.. అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలసి ఎన్నికలలో పాల్గొన్నప్పుడు అప్పుడు కనపడలేదా నీకు కుటుంబం పాలన అంటూ సూటిగా ప్రశ్నించారు యువ నేత సిద్ధపరెడ్డి మునిశేఖర్ రెడ్డి.
నేను బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా రండి రేణిగుంట లోనే తేల్చుకుందాం అంటూ మాట్లాడారు సర్పంచ్. ఇప్పటికే కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్న విషయం మీలాంటి పెద్దలకు కనబడలేదు అనడం అస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి రేణిగుంట పట్టణంలో సమావేశం పెడితే పట్టుమని 50 మంది కూడా లేదు.. మా ఎమ్మెల్యేని విమర్శించేది మీరా. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 40 వేల పై చీలుకు మెజారిటీ ఇచ్చారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విష్ణువర్ధన్ రెడ్డి..
గ్రామాలలోకి రండి ప్రజాదరణ ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా చూపెడతాం. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ సచివాలయలకు ముఖ్యమంత్రి నిధులనుండి 20 లక్షల రూపాయలు విడుదల చేసి రోడ్లో వేస్తున్న విషయం మీకు తెలియదా. మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఇప్పటికే మూడు సంవత్సరాలల్లో ఒక్క రేణిగుంట మండలంలోని తారకరామా నగర్ లో 70 లక్షల రూపాయలతో సిసి రోడ్డు వేసిన విషయం తెలియదా! తారక రామా నగర్ 1983 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలించింది. సంవత్సరాలలో అభివృద్ధి శూన్యం సంక్షేమాన్ని పక్కన పెట్టారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మధుసూదన రెడ్డి కేవలం మూడు సంవత్సరాల లో శ్రీ కాళహస్తి నియోజకవర్గ రూపురేఖల్ని రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మా నాయకుడు. ప్రజల కోసం ప్రజల ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే వ్యక్తి పేద ప్రజలకు ఇంకా సేవ చేయాలనే తపన ముందుచూపు ఉన్న సేవకుడు మా నాయకుడు మదన్న, మరోసారి ఇలాంటి అనవసరపు మాటలు మాట్లాడితే మేము కూడా ఘాటుగా మాట్లాడవలసి వస్తుందని ఈ సందర్భంగా యువ నేత తూకివాకం గ్రామ సర్పంచ్ సిద్ధపరెడ్డి మునిశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు.