రేణిగుంట సెప్టెంబర్ 23, (ఆంధ్ర పత్రిక): ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ చైర్మెన్ కేజె శాంతి ఘన స్వాగతం పలికారు. కుప్పం పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రిని కేజే శాంతి కలుసుకొని పుష్పగుచ్చం అందించి శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఈడిగ కులస్థుల అభివృద్ధిపై వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా రాబోవు రోజుల లో ఈడిగ కులస్తులందరినీ ఒకే తాటి పైకి తీసుకుని వచ్చి రాజకీయ ఆర్థిక విద్య వైద్య రంగంలో అబివృద్ది వైపు పయనింపచేసి వెన్ను దన్నుగా ఉంటామని కేజే శాంతి కుమార్ దంపతులు తెలియజేసారు అంతేకాదు రాబోయే రోజుల్లో గీత కులాలన్నింటినీ ఎలా కలిసి ముందుకు నడవాలి అనికూడా కుల పెద్దలతో చర్చించి ముందు కు సాగుతామని తెలియజేసారు