తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా అంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు… ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా అని వెంకయ్యనాయుడు అన్నారు. భవిష్యత్ తరాలకు మన భాషా సంస్కృతుల వైభవాన్ని అందించేందుకు తెలుగు వారంతా పునరంకితం కావాలని ఆకాంక్షించారు. తెలుగు భాషను ప్రజలపరం చేసి, వాడుక భాషా ఉద్యమం సాగించిన గిడుగు రాంమూర్తి పంతులు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. గిడుగు చూపిన బాట ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని సూచిం చారు. అమ్మ భాష అందరి శ్వాస కావాలని పిలుపునిచ్చారు. ఎల్లలు దాటి తెలుగు వెలుగులు ప్రసరించాలని పేర్కొ న్నారు.ఆత్మవిశ్వాసం పెంచే అమ్మ భాషను ప్రాథమిక విద్యలో పరిపాలనా భాషగా, న్యాయ స్థానాల కార్యకలాపాలు, సాంకేతిక విద్యలోనూ, కుటుంబ సభ్యులతో మాట్లాడే భాషగా వినియోగించడమే గిడుగు వారికి ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మనం జాతీయ స్పోర్ట్స్ డేను జరుపుకుంటున్నట్లు మరో ట్వీట్ చేశారు. హాకీ ఫీల్డ్‌లో అతని అద్బుతమైన విన్యాసాలు తర్వాతి తరాల క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని వివరించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!