కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ మాజీనేత గులాం నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం గురించి తాను చాలా సార్లు ప్రతిపాదనలు చేసినా.. వాటిని రాహుల్ గాంధీ ఏనాడు పట్టించు కోలేదన్నారు. పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడాలని చాలాసార్లు రాహుల్‌కి చెప్పినా ఆయన పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. తాను ’త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పారు. గత 25 ఏళ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నికల కమిటీలు లేవని, ఈ విషయంలో సోనియా గాంధీకి లేఖ కూడా రాశానని చెప్పారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గులాంనబీ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలు, బలోపేతంతో పాటు ఇతర ముఖ్యమైన విషయాలపై సోనియా గాంధీ.. గతంలో సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకునే వారని గులాంనబీ ఆజాద్ చెప్పారు. 1998 నుంచి 2004 వరకూ సోనియా గాంధీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపేవారని, వారి సిఫార్సులను ఆమోదించేవారని వెల్లడిరచారు. గతంలో తనకు 8 రాష్ట్రాల ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పుడు 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పారు. ఏనాడు కూడా తనకు అప్పగించిన రాష్ట్రాల్లో సోనియా జోక్యం చేసుకోలేదని, కానీ, రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి అతనిపై సోనియా గాంధీ ఆధారపడుతున్నారని అన్నారు. అయితే… పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన, సంక్పలం రాహుల్ కు లేదన్నారు. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశం సోనియాగాంధీలో కనిపిస్తుందని గులాంనబీ ఆజాద్ అన్నారు.2013 జనవరి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక, అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారని, అయినా పార్టీలో ఏ మాత్రం మార్పు లేదన్నారు. గత వారం కాంగ్రెస్ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్.. ఈ రోజు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ’అర్ధరహితంగా’ ఉందని అన్నారు. 2014 జాతీయ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి రాహుల్ కారణమని ఆరోపించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!