జియో కస్టమర్లకు రిలయన్స్ శుభవార్త పలికింది. ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. ముందుగా ఢల్లీి, ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ తర్వాత క్రమంగా 2023 డిసెంబర్ వరకు దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, జిల్లాలు, మండలాలకు జియో 5జీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ మెటావర్స్ టెక్నాలజీ ద్వారా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న ముఖేష్ అంబానీ..జియో 5జీ సేవలపై ప్రకటన చేశారు. ఏతినీ స్టాండలోన్ 5ఉ అని పిలువబడే 5ఉ యొక్క తాజా వెర్షన్‌ను అమలు చేస్తుందని చెప్పారు. 5జీ మౌలిక సదుపాయాలపై రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుందని వెల్లడిరచారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన 5జీ వేలం పాటలో ప్రభుత్వానికి సుమారు రూ. 1.5 లక్షల బిడ్లు వచ్చాయి. 5ఉ స్పెక్టమ్ర్ వేలం బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. అటు దేశ వ్యాప్తంగా అక్టోబర్ నాటికి 5ఉ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!