కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు శుక్రవరాం ఆయన ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎంగా, కేంద్రమంత్రిగా, వవిధ రాష్టాల్రకు పర్యవేక్షకుడిగా ఆయన పనిచేశారు. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పు కుంటున్నట్లు ఆజాద్ వెల్లడిరచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల లేఖను ఆయన రాశారు. పార్టీలో సంప్రదింపుల పక్రియ లేకుండాపోయిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైనట్లు ఆయన తెలిపారు. ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి భారీ జలక్ తగిలినట్లు అయ్యింది. ఇటీవల మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ఆ పార్టీకి చెందిన కీలక పోస్టుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ కోటరీలో పట్టుదల, సత్తా లోపించిందన్నారు. ఈ నేపథ్యంలో చాలా బాధాకర రీతిలో 50 ఏళ్లు సేవ చేసిన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆజాద్ తన లేఖలో తెలిపారు. రాహుల్ గాంధీ వైఖరిపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ అపరిపక్వత పార్టీలో ఉన్న సంప్రదింపుల వ్యవస్థను నాశనం చేస్తోందని పేర్కొన్నారు. చాన్నాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. జీ`23 తిరుగుబాటుదారుల్లో గులాంనబీ ఆజాద్ కీలక వ్యక్తిగా నిలిచారు.కాంగ్రెస్ తో అర్ధశతాబ్ద కాలంగా సంబంధాలున్నాయని గులాంనబీ ఆజాద్ అన్నారు. అయినా ప్రసత్తుత పరిమణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో సంబంధం తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన సీనియర్ నేతలను పక్కన పెట్టడంపై తీవ్ర మనస్థాపం చెందానని తెలిపారు. రాహుల్ గాంధీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ రాజకీయ పలుకుబడి క్షీణించడం.. పలు రాష్టాల్ల్రో జరిగిన ఎన్నికలలో పేలవమైన పనితీరుకు రాహుల్ గాంధీ అపరిపక్వతే కారణమని ఆరోపించారు.ప్రభుత్వ ఆర్డినెన్స్ ను విూడియా ముఖంగా అందరూ చూస్తుండగానే చించివేయడం రాహుల్ అపరిపక్వ తకు నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్ పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్ జోక్యం పెరిగిందన్నారు. అనుభవం లేని కొత్త కోటరీ పార్టీ వ్యవహారాలను నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాహుల్‌ను నిందిస్తూనే సోనియాగాంధీని ప్రశంసించారు. దురదృష్టవశాత్తూ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. ముఖ్యంగా జనవరి 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత మొత్తం యంత్రాంగాన్ని ఆయన కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా విషయాల్లో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని ఆజాద్ అన్నారు. కీలక నిర్ణయాలు రాహుల్ గాంధీ లేదా ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకొంటున్నారని తప్పుపట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రెండు లోక్‌సభ ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓడిపోయిందన్నారు. పార్టీ కేవలం నాలుగు రాష్టాల్ర ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించిందన్నారు. నేడు కాంగ్రెస్ కేవలం రెండు రాష్టాల్ల్రో మాత్రమే అధికారంలో ఉందని..మరో రెండు రాష్టాల్ల్రో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతుందని ఆజాద్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ సంస్థాగత సమగ్రతను కూల్చివేసిన రిమోట్ కంట్రోల్ మోడల్ ఇప్పటికీ కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో అందుకుగల కారణాలపై అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోన్న జీ 23 నేతల్లో గులాంనబీ ఆజాద్ ఒకరు. ఇటీవల ఐదు రాష్టాల్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం పార్టీ సంస్థాగత మార్పుపై ఆజాద్ తీవ్రంగా గళమెత్తారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!