ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లోని మొహాలీలో హోవిూ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రూ. 660 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించారు. ఇది 300 పడకల సామర్థ్యంతో నిర్మించిన దవాఖానాలో ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. రేడియోథెరపీ,మెడికల్ ఆంకాలజీ, కెమోథెరపీ, ఇమ్యునోథెరపీ,బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయవచ్చు. 2014కి ముందు దేశంలో 400 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని.. గత 8 ఏండ్లలో దేశంలో 200 కంటే కొత్త వైద్య కళాశాలలు నిర్మించామన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా మన్నారు. అందుకే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!