మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైఎస్సార్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశారాయన. ఆయన ఒక అడుగు వేస్తే.. వైఎస్సార్ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హావిూలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మహానేతతో పాటు ఆయనతో అడుగులు వేసిన నేత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం కూడా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న సీఎం జగన్.. వచ్చే ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రకటించారు. గాంధీ, అంబేద్కర్, పూలే, అల్లూరి, ప్రకాశం, మహానేత వైఎస్సార్.. ఇలా మహనీయులను కలకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వీళ్లకు భౌతికంగా మరణం ఉన్నా.. వీళ్లు చేసిన మంచికి, భావాలకు మరణం ఉండదు అనేది వాస్తవమని సీఎం జగన్ తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నచిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని సీఎం జగన్ చీమకుర్తి సభా వేదికగా ప్రకటించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు కరెంట్ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందన్న సీఎం జగన్ ప్రకటించారు. గ్రానైట్ పరిశ్రమకు కొత్త స్లాబ్ సిస్టమ్ తీసుకురాబోతున్నట్లు తెలిపారాయన. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరినట్లు.. ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం కోసం రూ. 20 కోట్ల మంజూరు చేయడంతో పాటు తుళ్లూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌గా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇదిలావుంటే చీమకుర్తి సభలో జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ పాట సభలో నవ్వులు కురిపించింది. వద్దని జగన్ వారించినా వినకపోవడంతో ఆయనే స్వయంగా వెళ్లి వెంకాయమ్మను బలవంతంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. వైఎస్సార్ ఆశయాలను చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తున్నానని, మ్యానిఫెస్టోలో తెలిపిన 95 శాతం హావిూలు నెరవేర్చామని, దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత మేలు చేస్తానని హావిూ ఇచ్చారు. ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. గాంధీ, అంబేద్కర్, ఫూలే, అల్లూరి, ప్రకాశం, వైఎస్సార్ వంటి మహానాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, వారి మంచిపనులకు, భావాలకు మరణం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు 1,2 టన్నెలు పనులు వైఎస్ ప్రారంభించగా.. టీడీపీ హయాంలో నిలిచిపోయాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను తాము అధికారంలోకి రాగానే ప్రారంభించామని, 2023 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కొత్త జడ్సీ కార్యాలయం భవనం నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొగిలిగుండాల ప్రాజెక్టుకు బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడిరచారు. గ్రానైట్ పరిశ్రమలో స్లాబ్ విధానాన్ని మళ్లీ తీసుకువస్తామని జగన్ చెప్పారు. చిన్న గ్రానైట్ పరిశ్రమల కరెంట్ ఛార్జీలను యూనిట్‌కు రూ.2 తగ్గిస్తామని ప్రకటించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!