ఉత్తరాదిలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇప్పటివరకు 50 మంది వరకు చనిపోయారని అధికారులు తెలిపారు.వందలాది గ్రామాలను వర్షాలు ముంచెత్తాయి. ఇళ్లలోకి బురదనీరు వచ్చింది. రహదారులు ఇబ్బందికరంగా మారాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బ్రిడ్జీలు కూడా ధ్వసం అయ్యాయి. మరో రెండు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వర్షాలతో ఐదుగురు గల్లంతయిన సంగతి తెలిసిందే. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పీటీఐ వార్తాసంస్థకు ఓ అధికారి తెలియజేశారు.
50 మంది మృతి:
వర్ష ప్రభావంతో 50 మంది చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. వర్ష ప్రభావంతో మందీ, కంగ్రా, చాంబా జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. గత మూడురోజులో ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లో 36 మంది చనిపోయారు. పునరావాస శిబిరాల్లో వందలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తరాఖండ్‌లో నలుగురు చనిపోయారు. 13 మంది గల్లంతయ్యారు. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి.
ఒడిశాలో ఆరుగురు మృతి :
ఒడిశాలో ఆరుగురు చనిపోయారు. వర్షాలు, వరదలు 8 లక్షల మందిపై ప్రభావం చూపింది. వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. వర్షాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. మంచినీరు సరఫరా కూడా ఇబ్బందికరంగా ఉంది. రహదారులు దెబ్బతిన్నాయి.ఇప్పటివరకు లక్షా 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో జార?ండ్ నుంచి గాలుదిప్‌ా బ్యారేజీ ద్వారా వరదనీటిని విడుదల చేయడంతో ఉత్తర ఒడిశాలో గల అన్ని నదుల్లో నీటిమట్టం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు జార?ండ్ రామ్ గఢ్ జిల్లాలో శనివారం నాల్కారీ నది ఉప్పొంగి ప్రవాహించింది. దీంతో ఐదుగురు కొట్టుకుపోగా.. నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇలా ఉత్తర భారతాన్ని వర్షాలు వణికిస్తున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!