ఉచిత తాయిలాలు అన్నవి వాస్తవరూపంలో ప్రజలకు ఎప్పుడూ ఉచితంగా లభించడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యురాలు ఆశిమా గోయల్ అభిప్రాయపడ్డారు.పేద ప్రజలు ఏదో రూ పంలో వాటికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇచ్చే ముందే.. వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు, వాటి ప్రభావాన్ని ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. అప్పుడే పార్టీల మధ్య జనాకర్షక పథకాల విషయంలో పోటీ తగ్గుతుందని పేర్కొన్నారు.రాయితీలు ఇంకా ప్రమాదకరమైనవని ఆశిమా గోయల్ అన్నారు. వీటి వల్ల ధరలు, ఉత్పత్తి, వనరుల కేటాయింపు అన్నీ ప్రభావితమవుతాయని వివరించారు. ఫలితంగా పరోక్ష దుష్ఫరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఉదాహరణకు పంజాబ్లో ఉచిత విద్యుత్తు వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని తెలిపారు. ఇలా ఉచితాల వల్ల నాణ్యతలేని వైద్య, వైద్యం, గాలి, నీటిని పొందాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇది చివరకు పేద ప్రజలనే తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పుకొచ్చారు.దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపైనా ఆశిమా గోయల్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ.. దేశ వృద్ధిరేటు స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. చాలా విషయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మెరుగ్గా రాణించిందని పేర్కొన్నారు. దేశీయ వినిమయం పెరగడం, తయారీ రంగం దెబ్బతిన్న సమయంలో వ్యవసాయం రంగం రాణించడం, ఇంటి నుంచి పని, ఎగు మతులు, డిజిటలైజేషన్ వల్ల సేవా కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడం.. వంటి విభిన్న అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలిచాయన్నారు.గిరాకీపై ఏమాత్రం ప్రభావం లేకుండా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేలా కొనసాగించిన ద్రవ్య పరపతి విధానం మెరుగైన ఫలితాలిచ్చిందని గోయల్ తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలో అత్యంత గడ్డు పరిస్థితుల్ని దాటేశామన్నారు. ఏప్రిల్ తర్వాత ద్రవ్యోల్బణ సూచీ క్రమంగా దిగిరావడాన్ని ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!