న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరని స్పష్టం చేశారు. విజయవాడలో నూతన కోర్టుల భవనాల సముదాయాన్ని సీఎం జగన్తో కలిసి సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని చెప్పారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామన్నారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలన్నారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్లను ప్రోత్సహిస్తే బాగుంటుందని సూచించారు. సమాజం శాంతియుతంగా, ఐకమత్యంతో ఉంటే అభివృద్ధి చాలా సులువుగా జరుగుతుందని చెప్పారు. కొన్ని రాష్టాల్రు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో కోర్టు భవనాల నిర్మాణానికి నిధుల కోసం కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని చెప్పారు. పెండిరగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తన ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవ్యవస్థలో తనవంతుగా చాలా ఖాళీలు పూర్తిచేశానన్నారు. అన్ని కులాలు, ప్రాంతాల నుంచి వచ్చినవారికి ప్రాతినిధ్యం కల్పించామని వెల్లడిరచారు. ప్రజలందరికీ సత్వర న్యాయం అందేలా చూసే బాధ్యత న్యాయవాదులపై ఉందని, సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు వాటిని తానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వక్తలంతా ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారని, ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడాక.. తాను మాట్లాడకపోతే బాగుండదని, తెలుగులో మాట్లాడటం సంతోషకరమని అన్నారు. కోర్టు భవన నిర్మాణాలు పూర్తికావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, నిధుల జాప్యంతో ఈ భవనాల నిర్మాణం ఆలస్యమైందని జస్టిస్ తెలిపారు. జాప్యం వల్ల లాయర్లు, జడ్జీలు, బార్ అసోసియేషన్ సభ్యులు ఇబ్బందిపడ్డారని, ఎట్టకేలకు ఈ కాంప్లెక్స్ పూర్తికావడం సంతోషదాయకమని, పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలని జస్టిస్ కోరారు. ప్రజలందరి కీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. తాను రెండు తెలుగు రాష్టాల్ల్రో జడ్జిల ఖాళీలను భర్తీ చేశానని సిజెఐ తెలిపారు. 250 మంది హైకోర్టు జడ్జిలను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించ గలిగానన్నారు. విశాఖపట్నంలో కూడా ఓ భవనం చివరి దశలో ఉందని, దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ను కోరుతున్నామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. భవనాల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని కోరానని అన్నారు. కొన్ని రాష్టాల్రు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని ఆయన అన్నారు. న్యాయస్థానాల్లో పెండిరగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థను పటిష్ఠ పరిచే కార్యక్రమాల్లో భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!