ఉత్తరాది రాష్టాల్ల్రో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలం చేస్తున్నాడు. హిమాచల్? ప్రదేశ్?లో కొండచరియలు విరిగి పడి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని తంసా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు, భారీ వర్షాల కారణంగా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం సవిూపంలో భారీ వరదలు సంభవించడం వల్ల భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. మండీ జిల్లాలో గోహార్ సబ్ డివిజన్లోని జాదోన్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన్ ఖేమ్ సింగ్ అనే వ్యక్తి రెండంతస్తుల ఇంటిపై శనివారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంటిలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.అయితే ఘటనా సమయంలో ఖేమ్ సింగ్ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అనేక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అనేక గ్రామాల ప్రజలు వరుణుడి ప్రతాపానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు. భారీ వర్షాల ధాటికి చంబా జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి కాంగ్రా జిల్లాలోని పురాతన రైల్వే వంతెన కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాయ్‌పుర్ బ్లాక్‌లోని సర్ఖేత్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున 2.45 గంటల ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించి, సవిూపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం కల్పించామని? సిబ్బంది తెలిపారు.ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తంసా నది ్గదెహ్రాదూన్లోని ప్రసిద్ధ తపకేశ్వర మహాదేవ ఆలయం సవిూపంలో ప్రవహించే తంసా నది ఉద్ధృత రూపం దాల్చింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆలయ వ్యవస్థాపకుడు బిపిన్ జోషీ తెలిపారు.ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తంసా నదిఉద్ధృతంగా ప్రవహిస్తున్న తంసా నదిమాతా వైష్ణో దేవి ఆలయం సవిూపంలో వరదలు.. పెరిగాయి. ఆకస్మిక వరదల దృష్ట్యా మాతా వైష్ణో దేవి ఆలయానికి భక్తుల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!