జల్ జీవన్ మిషన్ కింద మూడేండ్లల్లో 7 కోట్ల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ఆయన గోవాలో హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్యర్ర వచ్చిన 70 ఏండ్లల్లో కేవలం 3 కోట్ల గ్రామాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా మంచినీళ్లుఇచ్చారని మోడీ తెలిపారు. దేశం గురించి పట్టించుకోని వ్యక్తులు.. దేశ వర్తమానం, భవిష్యత్ గురించి కూడా పట్టించుకోరన్నారు. ఓ దేశాన్ని నిర్మించడం అంత ఈజీ కాదన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, అయితే దేశాన్ని నిర్మించడానికి కఠోర శ్రమ తప్పనిసరి అని ప్రధాని మోడీ అన్నారు. తాము దేశ నిర్మాణ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు. అందుకే తాము ప్రస్తుత, భవిష్యత్తు సమస్యలను, సవాళ్ళను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. కాగా, గోవాలోని గ్రావిూణ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాలకు ఇంటింటికీ మంచి నీటిని అందజేయాలన్న లక్ష్యం సాకారమైనందుకు రాష్ట్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశం గురించి పట్టించుకోనివారు, ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. జల జీవన్ మిషన్ క్రింద గత మూడేళ్ళలో తన ప్రభుత్వం దాదాపు ఏడు కోట్ల గ్రావిూణ కుటుంబాలకు కొళాయి నీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, నీటి కనెక్షన్లను ఇచ్చిందని చెప్పారు. గ్రామాల్లో ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 10 కోట్ల కనెక్షన్లను ఇచ్చినట్లు చెప్పారు. దేశ నిర్మాణానికి శ్రమించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా శ్రమపడవలసిన అవసరం లేదని, అయితే దేశాన్ని నిర్మించడానికి కఠోర శ్రమ తప్పనిసరి అని తెలిపారు. తాము దేశ నిర్మాణ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు. అందుకే తాము ప్రస్తుత, భవిష్యత్తు సమస్యలను, సవాళ్ళను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. దేశం గురించి పట్టించుకోనివారు దేశం ఎదుర్కొంటున్న, ఎదుర్కొనబోతున్న సవాళ్ళను కూడా పట్టించుకోరని తెలిపారు. అలాంటివారు నీటి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతారని, ఆ మాటలను అమలు చేసేందుకు గొప్ప దార్శనికతతో పనిచేయరని అన్నారు. గోవాలోని గ్రావిూణ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాలకు నూటికి నూరు శాతం కుటుంబాలకు కొళాయి నీటిని అందజేయాలన్న లక్ష్యం సాకారమైనందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వీడియో లింక్ ద్వారా మోదీ మాట్లాడారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పనజీలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!