అమరావతి,అగస్టు16(ఆర్ఎన్ఎ): టీడీపీ హయాంలో అనేక విద్యుత్ సంస్కరణలు తెస్తే.. అవి వైసీపీ పాలనలో కానరావడం లేదని, వాటిని రద్దు చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయడంతో నేడు విద్యుత్ కొనాలన్నా.. దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. టీడీపీ చేసిన బకాయిలు మేం తీరుస్తున్నామని చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని చెప్పారు. జగన్ పాలనలో ఎప్పుడు జీతాలు వస్తాయో?, ఎప్పుడు ఉద్యోగాలు ఊడతాయో తెలియదు పరిస్థితి నెలకొందన్నారు. తెస్తున్న అప్పులు, సర్ చార్జీలు, పన్నుల ద్వారా వసూలు చేస్తున్న నిధులు ఏమౌతున్నాయని ప్రశ్నించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!