పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): భారత స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలని, ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు అర్థం చేయించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వాతంత్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ పోలీస్ హెడ్ క్వాటర్స్ నుంచి జేఎన్ఎస్ వరకు నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాంతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించా లన్నారు. ఈ నెల 16న సామూహిక స్వాతంత్య జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాలని విజయవంతం చేయాలన్నారు. గాంధీజీ ఆశయాలను మనమంతా ఆచరించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా మనమంతా కృషి చేయాలని మంత్రి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జి.డబ్లూ.యం.సి . మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జి.డబ్లూ.యం.సి కమిషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!