హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. హోంగార్డు ప్రస్తావన, చండూరు సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు రేవంత్ తన వీడియోలో పేర్కొన్నారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని రేవంత్ అన్నారు.చండూరు సభలో తనను అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు మునుగోడుకు దూరంగా ఉంటానని ఎంపీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య రేవంత్ ఓ మెట్టు దిగి కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పారు. మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడటంతో వారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డిని అవమానించే విధంగా ఎవరూ మాట్లాడిన తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచన చేయడం జరుగుతందని రేవంత్ రెడ్డి తన వీడియోలో పేర్కొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!