చండీఘడ్,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కానీ కొందరు అధికారులు మాత్రం ఈ ఉద్యమాన్ని తప్పుపట్టిస్తున్నారు. హరియాణాలోని ఓ రేషన్ డీలర్.. రేషన్ సరుకులతో పాటు రూ.20 పెట్టి జాతీయ పతాకాన్ని కూడా విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ’హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా రేషన్‌తో కూడిన జాతీయ జెండాను కొనుగోలు చేయాలని రేషన్ డీలర్ ప్రజలను బలవంతం చేశారు. ఈ ఘటన హేమ్డా గ్రామంలోని పీడీఎస్ దుకాణంలో జరిగింది. రూ.20 పెట్టి జెండాను కొంటేనే సరుకులు ఇస్తామని ఆ డీలర్.. జనాలను ఇబ్బందులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి.. ఆ రేషన్ డీలర్ లైసెన్స్‌ను రద్దు చేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు… ఇష్టం ఉన్నవారే జెండాలు కొనుగోలు చేయాలని.. బలవంత మేవిూ లేదని తెలిపారు. బలవంతంగా జెండాలు కొనుగోలు చేపిస్తున్నట్టు తెలుసుకొని.. ఆ రేషన్ డీలర్ లైసెన్స్ ను రద్దు చేసినట్టు కర్నాల్ డిప్యూటీ కమిషనర్ అనీష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. 75వ స్వాతంత్య వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న త్రివర్ణ పతాకా
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!