రేషన్ సరుకులతో జెండా విక్రయం
డీలర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
చండీఘడ్,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కానీ కొందరు అధికారులు మాత్రం ఈ ఉద్యమాన్ని తప్పుపట్టిస్తున్నారు. హరియాణాలోని ఓ రేషన్ డీలర్.. రేషన్ సరుకులతో పాటు రూ.20 పెట్టి జాతీయ పతాకాన్ని కూడా విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ’హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా రేషన్‌తో కూడిన జాతీయ జెండాను కొనుగోలు చేయాలని రేషన్ డీలర్ ప్రజలను బలవంతం చేశారు. ఈ ఘటన హేమ్డా గ్రామంలోని పీడీఎస్ దుకాణంలో జరిగింది. రూ.20 పెట్టి జెండాను కొంటేనే సరుకులు ఇస్తామని ఆ డీలర్.. జనాలను ఇబ్బందులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి.. ఆ రేషన్ డీలర్ లైసెన్స్‌ను రద్దు చేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు… ఇష్టం ఉన్నవారే జెండాలు కొనుగోలు చేయాలని.. బలవంత మేవిూ లేదని తెలిపారు. బలవంతంగా జెండాలు కొనుగోలు చేపిస్తున్నట్టు తెలుసుకొని.. ఆ రేషన్ డీలర్ లైసెన్స్ ను రద్దు చేసినట్టు కర్నాల్ డిప్యూటీ కమిషనర్ అనీష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. 75వ స్వాతంత్య వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న త్రివర్ణ పతాకాన్ని విక్రయించి… పేదల సొమ్మును లాగేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
………………………….
ఎక్కడా లేని విధంగా అభివృద్ది,సంక్షేమం
లబ్దిదారులతో మంత్రి కెటిఆర్ జామ్ కాన్ఫరెన్స్
హైదరాబాద్,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులతో మంత్రి కేటీఆర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని వెల్లడిరచారు. ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. మగపిల్లలు పుడితే రూ.12 వేలు, ఆడ పిల్లలు పుడితే రూ.13 వేలు ఇస్తున్నా మని తెలిపారు. అనవసర సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలు పెంచాలని సంకల్పించామన్నారు. సహజ ప్రసవం చేయించే వైద్య సిబ్బందికి రూ.3 వేల ప్రోత్సాహకం ఇస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దని కల్యాణలక్ష్మి తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నదని చెప్పారు. అంగన్ వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం కోటా తగ్గించిందని, అయినప్పటికీ అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు.
……………………………
టిఆర్‌ఎస్,బిజెపిల మధ్య రహస్య ఒప్పందం
రాజ్‌గోపాల్ కోసం టిఆర్‌ఎస్ మద్దతు
రాజీనామా చేసిన వెంటనే ఆమోదించిన స్పీకర్
అర్జంట్‌గా రాజీనామా ఆమోదించడంలో ఆంతర్యం ఇదే
13న మునుగోడులో పాదయాత్ర చేపట్టినట్లు రేవంత్ వెల్లడి
హైదరాబాద్,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో మునుగోడు బైపోల్ హీట్ మొదలైంది. ఉప ఎన్నిక గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఆజాదీ కా అమృత్ గౌరవ్ యాత్రలో భాగంగా రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఓక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను 5 నిమిషాల్లోనే ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో విూడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్.. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నిక టిఆర్‌ఎస్‌కు .. మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని.. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని అన్నారు. హుజురాబాద్ ఎన్నిక టీఆర్‌ఎస్‌కు అవసరమని… మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని అన్నారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటుంన్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మరోవైపు మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. గాంధీభవన్ లో ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయ్యింది.మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు.ఇప్పటికే టికెట్ ఆశావహులతో గాంధీభవన్ లో బోసురాజు సమావేశం నిర్వహించారు. పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, ప్లలె రవికుమార్, కైలాష్ నేతతో మాట్లాడారు. మరోవైపు హైదర్ గౌడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చెరుకు సుధాకర్ తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సమావేశం అయ్యారు. అయితే తాను టికెట్ ఆశించడం లేదని చెరుకు సుధాకర్ అన్నారు. కాంగ్రెస్ లో టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తానన్నారు. మాణిక్కం ఠాగూర్ తో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పారు.
…………………………….
హర్‌ఘర్ తిరంగా ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): హర్‌ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జాతీయ జెండాలతో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ , పలువురు బీజేపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, కేర్ హాస్పిటల్, సచివాలయం, లిబర్టీ, హిమాయత్ నగర్, శంకర్ మట్, అడిక్‌మెట్, మాణికేశ్వర్ నగర్, ఇఫ్లూ, చిలకలగూడ విూదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీ ముగియనుంది
…………………………
బ్యూటిషియన్‌పై అత్యాచారం
మేడ్చల్,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బ్యూటిషన్‌పై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి స్నేహితుల ద్వారా సంజీవరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి పలుమార్లు బ్యూటిసియన్‌పై సంజీవరెడ్డి అత్యాచారం చేశారు. బుధవారం యువతి పుట్టినరోజు కావడంతో ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయి త్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా వారు అర్ధరాత్రి పోలీస్
స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
………………………..
సిఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళానేతలు
ఆత్మీయతకు రాఖీ ప్రత్యేకతన్న జగన్
అమరావతి,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ):రక్షాబంధన్ సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలకు సిఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెª`లలెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు.
………………………….
చదువు కోసమే నా తాపత్రయం
అందిరికీ చదువు అబ్బాలన్నదే లక్ష్యం
అందుకే మూడేళ్లుగా నగదు బదిలీ చేస్తున్నా
మూడో విడుత విద్యాదీవెన కింద నగదు జమ
11.02 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లు చెల్లింపు
బాపట్లలో మూడో విడత జగనన్న విద్యాదీవెనలో సిఎం జగన్
బాపట్ల,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏ బిడ్డకైనా తప్పనిసరిగా అందాల్సింది చదువు మాత్రమే. చదువు అన్నది ఏ ఒక్కరూ కొల్లగొట్టలేనిదన్నారు. బాపట్లలో గురువారం జరిగిన ’జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. పేదరికం నుంచి చదువుల ద్వారానే బయటపడేయగలమన్నారు. రాబోయే కాలంలో పోటీని ఎదుర్కొంటూ సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో పిల్లలంతా జీవించాలని దీనికోసం ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నామని సీఎం అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యాదీవెన చెల్లిస్తున్నాం. తల్లుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాం. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా అన్ని రకాలుగా అక్క చెª`లలెమ్మలకు మంచిచేస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్ ఈమూడునెలలకు సంబంధించిన వందశాతం ఫీజురియింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని సీఎం అన్నారు. పదేళ్ల కిందట ఎలాంటి ప్రపంచం
ఉండేది.. 20 ఏళ్ల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి.. అంటే.. ఊహకందని విషయం. అంత వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు. ఆ మార్పులతో మనం ప్రయాణం చేయాలి. లేకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడలేరు. అందుకనే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి. అప్పుడే గొప్ప మార్పులు సాధ్యమవుతాయని సిఎం జగన్ అన్నారు. అలాంటి చదువులు రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ అందాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర కులాల్లోని పేద కుటుంబాలకు చెందిన బిడ్డలు, నా బిడ్డలు పెద్ద చదువులు చదువుకోవాలి. విూ అందరి అన్నగా దీన్ని కోరుకుంటూ 3 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. అందులో భాగంగానే ప్రాథమిక విద్యలోనే కాకుండాపెద్ద చదువులను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకువస్తూ 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని వివరించారు. ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. విూరు వెళ్లండి.. చదవండి.. ఎంతమంది బిడ్డలు ఉంటే.. అంతమందిని చదివిస్తాను అని సగర్వంగా తెలియజేస్తున్నానని అన్నారు.
చదివినప్పుడే మన బతుకులు, తలరాతలు మారుతాయి. ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకం మన రాష్ట్రంలో అమలవుతుందన్నారు. తల రాతలు మార్చాలన్న ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. ప్రతి తల్లి, తండ్రి కూడా ఖర్చుకు వెనకాడకుండా.. విూ బిడ్డలను బాగా చదివించండి
ఎంత మంది బిడ్డలు ఉన్నా.. చదివించండి.. తోడుగా విూ అన్న, తమ్ముడైన నేను ఉంటాను
ఆ బాధ్యత నేను తీసుకున్నాను అన్నారు. ప్రతి ఇంట్లోని నుంచి ప్రతి డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునే నా బిడ్డలు బయటకు రావాలన్నదే నా ఆకాంక్ష అని అన్నారు.
2017`18, 2018`19 సంవత్సరాలకు ఫీజు రియింబర్స్‌మెంట్‌బకాయిలను రూ.1778 కోట్లను నేను కట్టాను
మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కట్టాను. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకే ఈ రెండు సంవత్సరాల కాలంలో రూ.11,715 కోట్లు నా అక్క చెల్లెమ్మలకు మూడేళ్లకాలంలో ఇచ్చాం
పిల్లలను చదివించుకోవడంకోసం అప్పులు పాలు కాకూడదు, పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. విద్యారంగంలోని అమ్మ ఒడి, సంపూర్ణపోషణ, గోరుముద్ద, విద్యాకానుక, మన బడి నాడు`నేడు, ఇంగ్లిషు విూడియం, బైజూస్‌తో ఒప్పందం ఇవి మాత్రమే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. పాఠ్యప్రణాళికలో 30 నుంచి 40 శాతం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించాం. 10 నెలల ఇంటర్నెషిప్ ఏర్పాటు చేశాం. మైక్రోసాప్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. విద్యారంగంవిూద రూ. 53,338కోట్లు మూడేళ్ల కాలంలో పెట్టామని అన్నారు. కాలేజీల్లో చేరుతున్నవారి సంఖ్యను పెంచాలన్నది ఉద్దేశం. 2035 నాటికి 70శాతానికి జీఆర్ రేష్యోను పెంచాలన్నది ధ్యేయంగా ప్రకటించారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. గతానికి, ఇప్పటికి పాలనలో తేడాను గమనించండి. అప్పుల్లో గ్రోత్ రేట్ గత పాలనలో 19శాతం సీఏజీఆర్ ఉంటే, ఇప్పుడు 15శాతం మాత్రమే ఉంది.అదే రాష్ట్రం, అదేబడ్జెట్, అప్పులు కూడా గతంతో పోలిస్తే తక్కువ. విూ అన్న, విూ తమ్ముడు నేరుగా బటన్ నొక్కుతున్నాడు, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తోందని, ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, డీబీటీ ద్వారా పోతుందన్నారు. మనం వచ్చాక దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు కాబట్టి.. జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకనే వీరి కడుపు మంట కనిపిస్తోంది. వారికి లేనివి, నాకు ఉన్నవి.. దేవుడి దయ, విూ అందరి ఆశీస్సులు అని సిఎం జగన్ అన్నారు.
………………………….
వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు
కట్టలుగా దొరికిన నగదు నిల్వలు
ముంబై,ఆగస్ట్11(ఆర్‌ఎన్‌ఎ): మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్ పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా రూ.58 కోట్ల నగదు, 38 కిలోల బంగారం, వజ్రాభరణాలు, ఆస్తులకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు గుర్తించారు. మొత్తంగా రూ.390 కోట్ల విలువచేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ నెల 1 నుంచి 8 వరకు జాల్నా, ఔరంగాబాద్‌లోని వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఎనిమిది రోజులపాటు నిరాటంకంగా కొనసాగిన ఈ తనిఖీల్లో 260 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.
“““““““““““
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!