ఫోన్ చేస్తే చాలు ఒకటే కాలర్‌ట్యూన్. ఒకరోజు రెండురోజులో అంటే ఎవరైనా భరిస్తారు. కానీ, ఏళ్ల తరబడి అదే కాలర్‌ట్యూన్ వినాలంటే ఎవరైనా విసుగు చెందుతారు. కరోనా ఏ టైమ్‌లో వచ్చిందోగానీ.. వైరస్ టార్చర్ కంటే ఫోన్లో ఆ కాలర్ట్యూనే వినియోగదారులకు ఎక్కువగా టార్చర్ చేసిందనే చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలంటూ సూచన చేయడం మంచిదే అయినా.. ఆ మంచి మరీ శృతిమించిందనే విమర్శ ఉంది. రోజులు, వారాలు, నెలలు, ఏళ్ల తరబడి ఒకటే అరిగిపోయిన రికార్డు వినిపించి వినిపించీ జనాలను ఒక విధంగా వేధించారనే ఆరోపణ కూడా ఉంది. మోదీ సర్కారు ఆ కాలర్ ట్యూన్ పెట్టడం మినహా కొవిడ్ నివారణకు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలేవీ లేవని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రెండేళ్లుగా భరిస్తూ వస్తున్న ఆ కరోనా కాలర్‌ట్యూన్ బారి నుంచి ఇకపై విముక్తి లభించనుంది. నమస్కారం.. కొవిడ్`19 అన్‌లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతటా మొదలైంది. ఇలాంటి సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లకండి’’.. ఇలా ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే కాలర్‌ట్యూన్. అంతకుముందు, కరోనా వచ్చిన కొత్తలో ఇంకోటి ఉండేది. ’’కరోనా వైర్స్తో ఇప్పుడు యావత్ దేశం పోరాడుతోంది. మనమంతా ఆ వ్యాధితో పోరాడాలి. రోగితో కాదు…’’ ఇది కొవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో మన ఫోన్లలో వినిపించిన కాలర్‌ట్యూన్. వ్యాక్సినేషన్ గురించి ఇంకోటి. అంతే. ఇలా రెండు మూడు ట్యూన్స్ మన చెవుల్లో గింగిరాలు తిరిగేవి. నిద్రలో కూడా అవే వినిపించేవి. కనీసం ఎప్పటికప్పుడు ఆ మెసేజ్‌లు మార్చుదామనే ఉద్దేశ్యం కూడా లేకపోయేది ప్రభుత్వానికి. అలా ఓ మెసేజ్ రికార్డు చేయించి.. దాన్నే నెలల తరబడి విసుగుపుట్టేలా వినిపించారు. ఆ మంచి మెసేజ్ కాస్తా.. వాళ్లు చేసిన ఓవరాక్షన్‌కి ఈ గోల ఏంట్రా బాబోయ్ అనిపించేలా చేసింది.
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో కొవిడ్ కాలర్ ట్యూన్లకు ఇక స్వస్తి పలకాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 21 నెలలుగా అంతా ఫోన్లలో వింటున్న కొవిడ్ కాలర్ ట్యూన్ ఇక బంద్ కానుంది. ఆ కాలర్ ట్యూన్ల లక్ష్యం నెరవేరింది.. ఇకనైనా తొలగించండి’’ అంటూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏ), మొబైల్ వినియోగదారుల నుంచి కేంద్ర టెలికాం విభాగానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునే క్రమంలో.. కొవిడ్ కాలర్‌ట్యూన్ వల్ల కాల్ కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం పడుతోంది. అంతేకాదు విలువైన సెల్యులార్ బ్యాండ్ విడ్త్ వినియోగం అవసరానికి మించి జరుగుతోంది. ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తి కాల్స్ కనెక్టివిటీకి పట్టే సగటు సమయం పెరుగుతోంది’’ అని పేర్కొంటూ టెలికాం విభాగానికి సీవోఏ లేఖ రాసింది. ఎంతోమంది మొబైల్ వినియోగదారులు కూడా ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తారు. ఇలాంటి విజ్ఞప్తులన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ ‘కొవిడ్ కాలర్ ట్యూన్’ను తొలగించాలని నిర్ణయించింది. త్వరలోనే ఇక ఆ కాలర్‌ట్యూన్ నుంచి విముక్తి లభించనుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!