దేశంలోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలను (పీఏసీఎస్) కంప్యూటరీకరించాలని కేంద్రం నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో 63 వేల పీఏసీఎ్సల్లో రూ. 2516 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయితే పాలనలో పారదర్శకత పెరిగి…రైతులకు అందించే సేవలు మరింత మెరుగుపడతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి అయ్యే మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ. 1,528 కోట్లను భరించనుంది. ఇప్పటికే కంప్యూటరీకరణ పూర్తయిన వాటికి రూ.50 వేలు రీయింబర్స్ చేయనుంది. కంప్యూటరీకరణ లేని కారణంగా చాలా పీఏసీఎ్సలు సమర్థమంతంగా పనిచేయడం లేదని, డీసీసీబీలకు, రాష్ట్ర సహకార బ్యాంకులకు అనుసంధానం అయ్యే సాఫ్ట్వేర్లు లేవని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కంప్యూటరీకరణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో ఒకే ప్లాట్ఫామ్ ఉంటుందని, కామన్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుందని పేర్కొంది. దాంతో త్వరగా రుణాలు మంజూరు చేయడం, వేగవంతంగా ఆడిట్ వంటి ప్రయోజనాల కలుగుతాయని తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!