Car insurance: కార్లకు ఈ బీమా తీసుకుంటే నో టెన్షన్. వరద నష్టాలకూ కవరేజీ
ANDHRAPATRIKA : – – ఇటీవల వచ్చిన దానా తుపాను కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, బీహార్ లోని పలు ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. ఇళ్లు, కార్లు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి.
ముఖ్యంగా కార్లకు సంబంధించి ఇలాంటి సమయంలో బీమా అనేది బాధితులను ఆదుకుంటుంది. అయితే ఆ బీమాలో ప్రకతి వైపరీత్యాలకు కవరేజీ ఉండడం చాలా ముఖ్యం. ఆ అంశాన్ని కారు బీమా తీసుకునే ముందే గమనించాలి. అన్నిరకాల పాలసీల్లో దీన్ని అమలు చేయకపోవచ్చు. ప్రస్తుతం కార్ల వినియోగం బాగా పెరిగింది. వాటిని కొనడంతో పాటు విపత్తు సమయంలో రక్షణకు అవసరమైన బీమా తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా కారు కొనుగోలు చేసినప్పుడు బీమా పాలసీ తీసుకుంటాం. ఆ సమయంలో బీమా కవరేజీని పూర్తిగా పరిశీలించారు. ఏ ప్రమాదాలకు కంపెనీ బీమా ఇస్తుందో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
అలాగే అనేక కంపెనీల బీమాలను పూర్తి పరిశీలించిన తర్వాతే మనకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలపై అందించే కవరేజీపై నిబంధనలను స్పష్టంగా చదవాలి. వాటిలో షరతులను కూడా తెలుసుకుని, పూర్తి కవరేజీ ఉంటేనే బీమా తీసుకోవాలి. సమగ్ర (కాంప్రహెన్సివ్) కవరేజ్ పాలసీ ద్వారా వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల కారుకు కలిగే నష్టాలకు బీమా అందిస్తుంది. సుడిగాలులు, వర్షాలు, వరదల సమయలో కారుకు కలిగే నష్టాలకు పరిహారం అందజేస్తుంది. అయితే పాలసీ, బీమా ప్రొవైడర్ పై ఆధారపడి కొన్ని షరతులు, నిబంధనలు ఉంటాయి. బీమా తీసుకునే ముందు వాటిని సమగ్రంగా పరిశీలన చేయాలి.
బీమా క్లెయిమ్ చేసుకునే విధానం
-
ప్రకృతి వైపరీత్యాల సందర్బంగా కారు దెబ్బతింటే బీమా క్లెయిమ్ చేసుకోవడానికి ఒక నిర్ధిష్ట విధానం అనుసరించాలి.
-
ముందుగా ప్రమాదం జరిగిన తీరును, కలిగిన నష్టాన్ని బీమా కంపెనీకి తెలియజేయాలి. వాహనం దెబ్బతిన్న వెంటనే వీలైనంత త్వరగా ఈ పనిచేయాలి. అలాగే మీ ఫిర్యాదు బీమా కంపెనీకి అందినట్టు నిర్దారణ చేసుకోవాలి.
-
పెండింగ్ లో ఉన్న మునుపటి మొత్తాన్ని చెల్లించాలి. అనంతరం బీమా కంపెనీ తమ నిబంధనలు, షరతుల ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి చెల్లింపును విడుదల చేస్తుంది.