Watch: టీ కాచి అందించిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. వీడియో వైరల్
ANDHRAPATRIKA : – భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) స్వయంగా టీ కాచారు. ఆయన వెంట ఉన్న కొందరికి ఆ టీ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సీఎం మోహన్ యాదవ్ ఆదివారం సాత్నాలోని చిత్రకూట్ ధామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక టీ స్టాల్ వద్ద ఆయన ఆగారు. తాను టీ తయారు చేయవచ్చా? అని అక్కడున్న మహిళను అడిగారు. ఆమె సంతోషం వ్యక్తం చేయడంతో బారికేడ్ దాటి టీ స్టాల్ వద్దకు వెళ్లారు. టీ కోసం అల్లం దంచారు. టీ స్టాల్ మహిళ పేరు అడగ్గా ‘రాధ’ అని ఆమె చెప్పింది.
కాగా, సీఎం మోహన్ యాదవ్ ఎప్పుడైనా మీ కోసం టీ చేశారా అని ఆయన భార్య సీమా యాదవ్‌ను అక్కడున్న వారు అడిగారు. దీనికి సమాధానం చెప్పాలని మోహన్ యాదవ్‌తో ఆమె అన్నది. ‘ఆమె నా సోదరి, నువ్వు కాదుగా, సోదరుడు సోదరికి టీ తాగిస్తాడు’ అని అన్నారు. ఆ తర్వాత టీ అమ్మే మహిళకు డబ్బులు ఇచ్చారు. కప్పుల్లో టీ పోసి అక్కడున్న వారికి అందజేశారు. అనంతరం స్థానిక ఉత్పత్తులను కూడా ఆయన కొనుగోలు చేశారు. డిజిటల్ మోడ్‌లో చెల్లించారు. సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.