- ఇప్పటికైనా డీఈవో కార్యాలయంలో సమస్యలు పరిష్కారం అయ్యేనా?
- స్వాగతం పలుకుతున్న సమస్యలను సామరస్యంగా నూతన డిఈవో ఛేదిస్తారా?
- ఫారిన్ సర్వీసులు, డిప్యూటేషన్ల పేరుతో కార్యాలయాలకు అంకితమైన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలలకు పంపిస్తారా?
మచిలీపట్నం అక్టోబర్ 24 ఆంధ్ర పత్రిక.కృష్ణాజిల్లా నూతన డిఈఓ గా పి వి జే రామారావును నియమించారు. వీరు ఇప్పటిదాకా నెల్లూరు జిల్లా డీఈవోగా పనిచేస్తున్నారు.కృష్ణా జిల్లా డిఈఓ గా పని చేస్తున్న తాహెరా సుల్తానాను ఏపీ పాఠశాల విద్యాశాఖలో రిపోర్ట్ చేయమని తెలిపారు. వీరికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.నూతన డీఈఓ గా నియమితులైన పివిజే రామారావుకు జిల్లా విద్యాశాఖలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
వారి సమయస్ఫూర్తితో ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారా?అని ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తోంది.ఇటీవల ఆంధ్ర పత్రికలో ప్రచురించిన క్రీడలా? ఓడీలా? అనే వార్తకు తాహెరా సుల్తానా కృష్ణాజిల్లా నిడుమోలు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పి.డి.ని వారి ఓడిని రద్దు చేసి అదే ఉన్నత పాఠశాలకు పంపించడం జరిగింది. కానీ ఫారిన్ సర్వీస్ పేరుతో, డిప్యూటేషన్ ల పేరుతో డి ఈ ఓ కార్యాలయంలో ఏళ్ల తరబడి పాఠశాలలకు వెళ్లకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వివిధ శాఖాధికారుల వద్ద పనిచేస్తున్న ఉపాధ్యాయులని తిరిగి పాఠశాలకు పంపించడంలో తాహెరా సుల్తానా విఫలం చెందారు.ఎన్నాళ్ళ నుంచో ఫారిన్ సర్వీసులు డిప్యూటేషన్ల పేర్లతో పాఠశాల మొహమే చూడని ఉపాధ్యాయులను జిల్లాకు నూతనంగా వచ్చిన డీఈవో తిరిగి పాఠశాలలకు పంపిస్తారా? లేక ప్రలోభాలకు లొంగి పాత ఒరవడిలోనే డి ఈ ఓ కార్యాలయాల్లోనే కొనసాగిస్తారా? అని ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.ఎన్నాళ్ళనుండో పాతుకుపోయిన అనేక సమస్యలను రామారావు సమయస్ఫూర్తితో, చాకచక్యంగా చక్కదిద్ది విశాఖలో పాలనను గాడిలో పెడతారని, ఉత్తమ జిల్లా విద్యాశాఖ అధికారిగా పేరు తెచ్చుకుంటారని ఉపాధ్యాయులంతా పాఠశాలల్లోనే ఉండేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. నూతన డి ఈ ఓ రామారావు డీఈఓ, డి వై ఈ ఓ, ఎస్ ఎస్ ఏ తదితర కార్యాలయాలలో ఏళ్ల తరబడి అంకితమైన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలలకు పంపిస్తారో, లేక కొనసాగిస్తారో? వేచి చూద్దాం..!