Telangana: ఏది పడితే అది షేర్ చేస్తే.. ఇక ‘కటకటాలే’..
ANDHRAPATRIKA : – – దేశ విదేశాల్లో ఎక్కడి నుంచైనా మతకలహాలు సృష్టించే విధంగా మతాలను కించపరిచే విధంగా వీడియోలు మెసేజెస్ పోస్ట్ చేస్తున్న వ్యక్తుల్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
ఇకపై శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా పోస్ట్ పెట్టిన వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తూ రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన కొన్ని మార్ఫింగ్ వీడియోల వల్ల అనేక సమస్యలు తలెత్తాయని పోస్టులు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని వివరించారు.
సోషల్ మీడియాలో ఏదైనా వీడియో మెసేజ్ వస్తే సమాచారం పూర్తిగా తెలుసుకోవాలని పోలీసు అధికారులు ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇష్టానుసారంగా వీడియోస్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసి శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టం తన పని చేసుకుంటూ పోతుందని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాస్ టీవీ9 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. సికింద్రాబాద్ ఘటన తర్వాత హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేటస్ పెట్టిన వ్యక్తికి భాష రాదు, ఆందోళన చేసిన స్థానికులకు పూర్తి సమాచారం లేకపోవడంతో సమస్యలు తలెత్యాయని డీసీపీ వివరించారు.