వంద రోజుల్లో టీసీఎస్ క్యాంపస్ విషయంలో ముందడుగు పడుతుందని లోకేష్ ఇటీవలే చెప్పారు. ఆయన చెప్పే నాటికే టీసీఎస్.. విశాఖలో క్యాంపస్ కోసం పరిశీలన చేపట్టింది. ప్రభుత్వం భూమి కల్పిస్తే అందులో భవనాలు కట్టి కార్యకలాపాలు ప్రారంభించాలా లేకపోతే.. తాత్కలకంగా భవనాన్ని తీసుకుని అందులో ప్రారంభించాలా అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
టీసీఎస్‌కు అవసరమైన భవనాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయి. గత టీడీపీ హయాంలో నిర్మించిన మిల్లీనియం టవర్స్ ను గత ప్రభుత్వం ఖాళీ చేయించి పెట్టింది. ఇప్పుడు ఆ టవర్ టీసీఎస్ కార్యకలాపాలకు సరిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని భవనాలను ప రిశీలించి ఆ కమిటీ బృందం ఓ నివేదికను రెడీ చేసి.. నిర్ణయాత్మక స్థాయిలో ఫైనల్‌గా ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా టీసీఎస్ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేస్తారు.
విశాఖలో తాత్కలిక భవనాల కోసం పరిశీలన చేసినా.. ఏర్పాటు చేసినా తరవాత ప్రభుత్వం కేటాయించే భూమిలో వరల్డ్ క్లాస్ క్యాంపస్ ను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ చెప్పినట్లుగా వంద రోజుల్లో కాకపోయినా.. ప్రభుత్వం వార్షికోత్సవం పూర్తయ్యేనాటికి టీసీఎస్ క్యాంపస్ ఏర్పడితే.. విశాఖ రాత మారిపోతుదంని అనుకోవచ్చు.