ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల పేలుడు సంభవించింది. ఆదివారం (అక్టోబర్ 20) ఉదయం 7:50 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాల గోడ సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడు జరిగిన వెంటనే భారీ పొగలు కూడా కనిపించాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని మంటలు అదుపు చేసింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులు ఎవరూ స్కూల్‌కి రాలేదు. లేకుంటే ప్రాణ నష్టం జరిగేదని చెబుతున్నారు.
పేలుడు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. పేలుడు కారణంగా సమీపంలో పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. సిఆర్పిఎఫ్ పాఠశాలకు సమీపంలో చాలా దుకాణాలు ఉన్నాయని, అందువల్ల సిలిండర్ పేలుడు ఫలితంగా ఈ పేలుడు సంభవించే అవకాశం ఉందని చెప్పారు.