Rain Alert: ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బీ అలర్ట్..
![Rain Alert: ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బీ అలర్ట్..](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/1280x720_90/fetchdata20/images/4b/e8/c4/4be8c499d03c97b8f6f3d86874fb802fd07371d457d027490925be2d185cd38d.jpg)
ANDHRAPATRIKA : – – అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది.
ఐఎండి సూచనల ప్రకారం.. దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. వాయుగుండం గురువారం (17-10-24) తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో రేపు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/360x100_60/fetchdata20/images/71/7a/dc/717adc9e5fadb6d7529603d514f145d772b0443635ca1e6ac5aee8d2ac99dc6d.webp)
మంగళవారం విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, స్పెషల్ సీఎస్ సిసోడియా వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు జారీచేశారు. ప్రజలకు హెచ్చరిక సందేశాలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శ్యాటిలైట్ ఫోన్స్ పని తీరు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాల్లో అత్యవసరమైతే శ్యాటిలైట్ ఫోన్స్ వినియోగించడానికి ఏర్పాట్లు చేసినట్లు మంత్రికి వివరించారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వివరించారు.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/360x100_60/fetchdata20/images/2d/cc/47/2dcc4798c62585a3d1bc9f50698f34e09f18f69125c779cf0602062038c2b7bc.webp)
16 అక్టోబర్, బుధవారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/360x100_60/fetchdata20/images/0d/0c/f8/0d0cf8c5e2dc8d30b6090ce1f224c9f154c1fa1a3a9ea1cdb27e11391d9d5517.webp)
17 అక్టోబర్, గురువారం: పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/360x100_60/fetchdata20/images/cc/87/21/cc8721931f2e59f8f6823868f18669be50004a6cda90a649a0567a8742f29daf.webp)
18 అక్టోబర్, శుక్రవారం: విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.