ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ముహూర్తం ఖరారు- సిలబస్ పై క్లారిటీ..!!
ANDHRA PATRIKA : – – ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ పైన తొలి సంతకం చేస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీ పైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు చేసింది. అదే విధంగా సిలబస్ పైన స్పష్టత ఇచ్చింది.
నోటిఫికేషన్ కు కసరత్తు
ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ -2024 ను నవంబర్ 3న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే ప్రకటించిన విధంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్ పరీక్షల ఫలితాలను నవంబర్ 2న ప్రకటించేందుకు రంగం సిద్దం అవుతోంది. టెట్ ఫలితాలు విడుల తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి.
సిలబస్ పై స్పష్టత
ప్రస్తుత సమయంలో, టెట్ 2024 పరీక్షలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులను సూచిస్తూ, ఎలాంటి న్యాయ వివాదాలు కలగకుండా ప్రణాళిక రచించాలన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణ..పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. డీఎస్సీ 2024 సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం తెలిపింది. సిలబస్ మారిందనే ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సిలబస్ వివరాలు https://aptet.apcfss.in లో సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
డీఎస్సీ పోస్టుల వివరాలు
గత వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఉందులో 2280 సకెండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ముందు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో మొత్తం డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది. నవంబర్ 3న జారీ కానున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లు 1781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీలు 132 ఉన్నాయి.