Supreme Court Shock : నోర్మూయ్యండి…చంద్రబాబుకు సుప్రీం షాక్ !
ANDHRAPATRIKA : — తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ ఆరోపణల వివాదంలో సుప్రీంకోర్టు(Supreme court) చాలా కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై కోట్లాది మంది హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను(AP SIT) ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని మీరే చెప్పి మళ్లీ మీరే సిట్ వేయడంలో ఉద్దేశమేమిటి, సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబును(Chandrababu) సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందంటూ సిట్ తన పనిని ఆపేసింది. ఆపేసిన సిట్‌తో ఇక పనిలేదు, ఆ సిట్‌ను పక్కన పెట్టేయండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. సిట్ ఇచ్చే నివేదికను నమ్మే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు అభిపాయపడింది. సిట్ దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణ ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జర్నల్ తుషార్ మెహతా అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌తో తేలేదేమీ లేదని, సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని నమ్మలేమని సుప్రీంకోర్టుకు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, కేంద్ర సంస్థలకు చెందిన ఓ అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే బాగుంటుందని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే సుప్రీంకోర్టు సీబీఐ(CBI) డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగబోతున్నది. ప్రత్యేక సిట్ కోసం సీబీఐ డైరెక్టర్ ఇద్దరు అధికారులను నియమిస్తారు. అలాగే రాష్ట్ర పోలీసుల అధికారులిద్దరు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఓ అధికారిని నియమిస్తారు. మొత్తం ఈ దర్యాప్తు అంతా సుప్రీంకోర్టు మానటరింగ్ చేస్తంది. విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిచుకుంటుంది కొత్త సిట్!
అయితే ఈ దర్యాప్తుకు కాలపరిమితి లేకపోతే మాత్రం నిదానంగా సాగే అవకాశం ఉంటుంది. సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. సీబీఐ కేసులు సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలు, పాతిక సంవత్సరాలు కేసులు కొనసాగడాన్ని చూస్తున్నాం. సీబీఐకు ఇచ్చారంటే ఇక కోల్డ్ స్టోరేజ్‌కు పోయినట్టేననే భావన ప్రజలలో ఉంది. సీబీఐకి ఇచ్చిన కేసులు, రాజకీయపరమైన కేసులు, రాజకీయపార్టీలకు అనుకూలమైన కేసులు, ప్రభుత్వాలకు అనుకూలమైన కేసులు అయితే తప్ప మిగతా కేసులను పక్కన పెట్టేస్తున్నారనే భావన చాలా మందిలో ఉంది. ఇదే ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలో కలవరం కలిగిస్తున్న అంశం. కాలపరిమితి విధించలేదంటే నివేదిక ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు.. అందుకే కోట్లాది మంది హిందువులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే సర్కారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా ఎన్డీయే ప్రభుత్వమే! ఏపీలో ఎన్డీయేకు చెందిన కీలకనేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునే నేరుగా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అయితే అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కూడా కల్తీవేనని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా కల్తీ జరిగిందని ప్రకటించారు. పైగా ఆమె సుపీంకోర్టు వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు. ఒకవేళ దర్యాప్తు సంఘం లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని నివేదిక ఇస్తే మాత్రం అది కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుంది. అందుకే దర్యాప్తు సంఘంపై అనుమానాలు వస్తున్నాయి. నివేదిక నిజాయితీగా ఇస్తుందా? లేక ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తుందా? అన్న సందేహం అయితే చాలా మందికి ఉంది. దాంతో పాటు ఏం విచారణ చేస్తారు? గత ప్రభుత్వ కాలం నుంచి విచారణ జరుపుతూ వస్తారా? ఏఆర్ సంస్థ పంపిన నెయ్యికే పరిమితం అవుతారా? అన్నది కూడా తేలాలి. మొత్తంగా చూస్తే సుప్రీం ఇచ్చిన ఆదేశాలు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. లడ్డూ వివాదంపై రాజకీయ డ్రామాలు ఆపండి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు కూటమి నేతలు భుజాలు తడుముకునేలా చేశాయి. తిరుమల లడ్డూతో నిన్నటి వరకు నాటకాలు ఆడింది కూటమి నేతలే కాబట్టి సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసిందనుకోవాలి.