కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల ల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అద్భుతమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ మారి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వైవిధ్యమైన కథలతో లు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. తన నటనా ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. అంతేకాదు ఫిల్మ్ ఫేర్, సైమా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇంతకీ ఈ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా? మీకో క్లూ.. ఇతని భార్య కూడా ఒక స్టార్ హీరోయిన్. క్రేజ్ లో కానీ పాపులారిటీలో కానీ భర్తకు మించే ఉంది. తెలుగు ల్లోనూ మల్లీశ్వరిగా మెప్పించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ హీరో మరెవరో కాదు ఇటీవలే బ్యాడ్ న్యూస్ తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న విక్కీ కౌశల్.
ఇక ఫై ఫొటో విషయానికి వస్తే.. ఇది 2001లో షారుఖ్ నటించిన అశోక మూవీ సెట్ లోనిది. వీక్కీ కౌశల్ తండ్రి ప్రముఖ స్టంట్ డైరెక్టర్ శామ్ కౌషల్ లేటెస్ట్ గా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో విక్కీ ఇంకా 8వ తరగతి చదువుతున్నాడని తండ్రి చెప్పుకొచ్చారు. కాగా షారుఖ్ నటించిన సూపర్ హిట్ డుంకీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించాడు. గతేడాది రిలీజైన ఈ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇటీవల విక్కీ నటించిన బ్యాడ్ న్యూస్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.