మన దేశంలో ఆధార్ (Aadhaar card) చాలా ముఖ్యమైన ఐడెంటిటీ కార్డ్‌గా మారిపోయింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, బ్యాంకు అకౌంట్ తెరిచినప్పుడు, సిమ్ కార్డు తీసుకునేటప్పుడు..
ఇలా అనేక పనులకు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఆధార్ కార్డు ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగలించినా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే, ఆధార్ కార్డులో మన గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ప్రజల పేరు, చిరునామా, పుట్టినరోజు, ఫింగర్‌ప్రింట్స్, IRIS డేటా వంటివి ఎవరికైనా దొరికితే, ఈ వివరాలను మిస్యూజ్ చేయవచ్చు. అందుకే ఆధార్ కార్డును లాక్ చేయాలి. దీన్ని లాక్ చేస్తే, ఎవరూ ఆధార్ వివరాలను ఎవరూ చెడు పనులకు వాడుకోలేరు. ఆధార్‌ను లాక్ చేయడానికి కొన్ని రెండు పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
* ఆన్లైన్ మెథడ్
– అఫీషియల్ UIDAI వెబ్సైట్ https://uidai.gov.in/ను విజిట్ చేయాలి. “మై ఆధార్” ట్యాబ్‌కు వెళ్లాలి.
– స్క్రీన్‌పై ఆప్షన్స్‌లో “ఆధార్ సర్వీసెస్”ను సెలెక్ట్ చేసుకోవాలి.
– “ఆధార్ లాక్/అన్‌లాక్” ఆప్షన్‌పై నొక్కి, “లాక్ UID” సెలక్ట్ చేసుకోవాలి.
– ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి “సెండ్ OTP” బటన్‌పై క్లిక్ చేయాలి.
– రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేసి, రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఆధార్ లాక్ అయిపోతుంది.
అన్‌లాక్ చేసే ప్రాసెస్
మళ్లీ ఆన్లైన్లోనే అన్‌లాక్ చేయాలనుకుంటే పైన పేర్కొన్న 1-2 స్టెప్స్ మరోసారి ఫాలో కావాలి. తర్వాత “ఆధార్ లాక్/అన్‌లాక్” ఆప్షన్‌పై క్లిక్ చేసి “అన్‌లాక్ UID” సెలక్ట్ చేసుకోవాలి. 16-అంకెల వర్చువల్ IDని ఎంటర్ చేసి, తర్వాత “సెండ్ OTP” బటన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తే.. ఆధార్ కార్డు అన్ లాక్ అయిపోతుంది.
SMS మెథడ్
ఆధార్ కార్డు నంబర్లో చివరి నాలుగు అంకెలను రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 1947 అనే నంబర్‌కు SMS చేయాలి. ఆ SMSలో “GETOTP (ఆధార్ చివరి నాలుగు అంకెలు)” అని ఇలా రాసి పంపాలి. ఉదాహరణకు: మీ ఆధార్ నంబర్ 223344556677 అయితే, మీరు పంపాల్సిన SMS “GETOTP 6677” ఇలా ఉంటుంది. అలా SMS పంపిన కొన్ని సెకన్లలో రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు ఒక OTP వస్తుంది. దాన్ని నోట్ చేసుకోవాలి. తర్వాత మళ్లీ 1947 నంబర్‌కు ఒక SMS పంపాలి. ఆ SMSను “LOCKUID (చివరి నాలుగు అంకెలు) (OTP)” ఇలా రాసి పంపాలి. ఉదాహరణకు: మీ ఆధార్ నంబర్ 223344556677 అయితే, మీకు వచ్చిన OTP 123456 అయితే, మీరు పంపాల్సిన SMS “LOCKUID 6677 123456” అని ఉండాలి.
లాక్ చేశాక ఏమవుతుంది?
ఆధార్ కార్డులో ప్రజల పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి చాలా సమాచారం ఉంటుంది. సైబర్ క్రిమినల్స్ ఈ సమాచారాన్ని తప్పుడు పనులకు ఉపయోగించుకోవచ్చు. కానీ లాక్ చేసుకుంటే ఆధార్ డేటాను ఎవరూ మిస్ యూజ్ చేయలేరు. ఫింగర్‌ప్రింట్స్ వంటి బయోమెట్రిక్ డేటా కూడా ఆధార్ డేటాబేస్‌లో ఉంటుంది. ఆధార్‌ను లాక్ చేసుకుంటే ఈ డేటాను ఇతరులు యాక్సెస్ చేయలేరు. కార్డు హోల్డర్ పర్మిషన్ లేకుండా రెండో వ్యక్తి ఈ డేటాను ఉపయోగించలేరు. అందుకే ఆధార్ కార్డును లాక్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఐడెంటిటీ థెఫ్ట్ ప్రమాదకరమైన క్రైమ్స్ నుంచి కూడా బయటపడవచ్చు.