దిల్లీ: లెబనాన్ (Lebanon)లో హెజ్బొల్లా (Hezbollah) శ్రేణులు లక్ష్యంగా కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ జరిపిన ‘పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్’తో ప్రపంచ అవాక్కయింది.
దీనిపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Indian Army Chief General Upendra Dwivedi) స్పందించారు. ఆ గ్రూప్‌ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో పేలుడు పదార్థాలతో ఉన్న పేజర్లను పంపేందుకు ఇజ్రాయెల్ (Israel) ఒక షెల్ సంస్థను ఏర్పాటు చేయడంపై మాట్లాడుతూ.. అదొక మాస్టర్ స్ట్రోక్ అన్నారు. ”మనం దాడులు మొదలుపెట్టిన రోజు యుద్ధం ప్రారంభమైనట్టు కాదు. ప్రణాళిక సిద్ధం చేసిన రోజే యుద్ధం మొదలైనట్టు” అని ద్వివేది వ్యాఖ్యానించారు.