హైదరాబాద్: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌పాస్‌లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు అభివృద్ధి చేయనుంది.
ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.