స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఏఎస్) చెందిన ఓ ఫ్లైట్‌లో ప్యాసింజర్‌కు ఊహించని చెదు అనుభవం ఎదురైంది. ఫుడ్ పార్శిల్‌ను ఓపెన్ చేయగా అందులో నుంచి బతికి ఉన్న ఎలుక ఒకటి బయటకు దూకింది.
దీంతో ప్రయాణికురాలు ఒక్కసారిగా షాక్ అయింది. విషయాన్ని ఫ్లైట్ సిబ్బందికి తెలియజేయగా.. వారు ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం నాడు స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఏఎస్) చెందిన ఓ ఫ్లైట్ నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో అత్యవసరంగా కిందికి దించారు.