వరద బాధితులకుచేయూ
– డీఎస్ఓ పూర్వ విద్యార్థులు,
నాద యోగ సాంస్కృతిక సంస్థ
ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ
———————————
విజయవాడ వరద ప్రభావ ప్రాంతమైన సుందరయ్య నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట, ఉడా కాలనీ వరద బాధితులకు డీఎస్ఓ పూర్వ విద్యార్థులు, హైదరాబాద్ నాదయోగ సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా దుప్పటి, టవలు, చీర, లుంగి ఒక కిట్ గా అందజేశారు. డీఎస్ఓ పూర్వ విద్యార్థి నాయకురాలు గంగాభవాని, నాదయోగ సాంస్కృతిక సంస్థ ఫౌండర్ నాగవర్ధిని మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు మానవతా దృక్పథంతో తమకు చేతనైనంత సాయం చేయటం సంతోషంగా ఉందని అన్నారు. బాధిత ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మానవతా దృక్పథంతో ఎంతో సాయం అందజేస్తున్నారని, అయినప్పటికీ అది వారి బాధలు తీర్చలేవని, ప్రభుత్వం కూడా అర్హులైన వరద బాధితులందరికీ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాదయోగ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు డాక్టర్ నవీన్ చెట్టి , డీఎస్ఓ పూర్వ విద్యార్థి నాయకులు టి నరసింహారావు, శ్రీనివాస్, నారాయణరెడ్డి, లక్ష్మి, నాదయోగ కార్యదర్శి స్వాతి శ్రీధర్, ఉప కార్యదర్శి ప్రజ్ఞ, సభ్యులు నూక తోటి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. తాము చేపట్టిన ఈ చిరు సహాయ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు త్రినేత్ర అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గద్దె శ్రీనివాసరావు, బి శ్రీదేవి, శిరీష, సాకేత్, తదితరులు, పాలమాని ప్రసాద్, మద్దిశెట్టి నాగరాజు, లావణ్య, సర్నాల సురేష్, సబ్ ఎడిటర్ శ్రీధర్, కే దుర్గ, పి పద్మ, లక్ష్మి తదితరులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.