- – హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకా కొన్ని వందల గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు బారులు తీరాయి.
దీంతో ఖైరతాబాద్, లక్డీకాపూల్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. ఇక గణనాథుల నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.