మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు. పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని ఈ సమయంలో మనం చేసే స్నానాలు, దానాలు, తర్పణాలు, శ్రార్ద కర్మలు పూర్వీకులకు ఆత్మసంతృప్తిని కలుగజేసి వారిని సంతోషపెడతాయని చెబుతారు.
ఫలితంగా పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఉంటుందని చెబుతారు.
పితృపక్షం సమయంలో ఇవి కొంటే త్రిదోషం
ఇక నేటి నుండి పితృపక్షం ప్రారంభమవుతుంది. పితృపక్షం సమయంలో ప్రతి ఒక్కరూ పూర్వీకులకు సంతోషం కలిగేలాగా చేయవలసిన కర్మలను చేసి వారి ఆశీర్వాదాలను పొందాలి. నేటి నుంచి ప్రారంభమైన పితృపక్షంలో పూర్వీకులను సంతోషపెట్టాలనుకునేవారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భావించేవారు, కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. ఒకవేళ తెలిసో తెలియకో పొరపాటున కొనుగోలు చేస్తే త్రిదోషం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
పితృపక్షం రోజులలో ఉప్పుతో పాటు ఇవి కొనొద్దు
పితృపక్షం సమయంలో పొరపాటున కూడా ఎవరు ఉప్పును కొనుగోలు చేయకూడదు. ఈ సమయంలో ఉప్పు కొనుగోలు చేస్తే పితృ దోషం కలుగుతుంది. అది మీకు ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది. కాబట్టి ఉప్పు కొనుగోలు చేయాలనుకునేవారు పితృపక్షానికి ముందు కానీ పితృపక్షం పూర్తయిన తర్వాత గాని కొనుగోలు చేసుకోవాలి. ఇక పితృపక్షం రోజులలో ఆవాలను కానీ, ఆవ నూనెను కాని కొనుగోలు చేయడం మంచిది కాదు.
ఇవి కొంటే పితృదేవుళ్ళ ఆగ్రహానికి బలి అవుతారు
ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆవనూనెను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి పోతుందని, దరిద్రం వారిని పట్టిపీడిస్తుందని చెబుతున్నారు. పితృదేవతలకు ప్రాధాన్యత నిచ్చే పితృపక్షం రోజులలో కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. ఒకవేళ బట్టలు, బంగారం కొనుగోలు చేస్తే పితృదేవతల ఆగ్రహానికి గురికాక తప్పదని సూచిస్తున్నారు.
త్రిదోషంతో అనారోగ్యం, అకాల మరణం చెందే ప్రమాదం
ఇక పితృపక్షం సమయంలో ఎవరు చీపురును కూడా కొనుగోలు చేయకూడదు. చీపురును ఈ సమయంలో కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. పితృపక్షం రోజులలో ఎవరైతే వీటిని కొనుగోలు చేస్తారో వారు త్రిదోషం బారిన పడతారని, త్రిదోషం బారిన పడినవారు అనారోగ్యంతో అకాల మరణం చెందే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా పితృ పక్షాల సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయకూడదని, పితృదేవతలు సంతోష పడే విధంగా చేయవలసిన కర్మలను చేయాలని సూచిస్తున్నారు.