కోల్‌కతా: సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ‘ఆర్థిక అవకతవకల’ కోణం నుంచి కూడా సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip పై పాలిగ్రాఫ్ టెస్ట్, వాయిస్ ఎనాలిసిస్ జరుపగా, ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.ఆగస్టు 9వ తేదీని ఆర్జీ కర్ ఆసుపత్రి సెమినార్ హాలులో అత్యాచారం, హత్యకు గురైన ట్రయినీ వైద్యురాలి ఘటన సంచలనం సృష్టించడంతో సీబీఐకి కేసు అప్పగించారు. హత్యాచార ఘటనపై ఉదయం 9.59 గంటలకు సందీప్ ఘోష్‌కు సమాచారం అందిందని, కానీ వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సీబీఐ చెబుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంపై ఆయనను ఈనెల 2న అరెస్టు చేసి పాలిగ్రాఫ్, వాయిస్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ రెండు పరీక్షల్లో ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చారని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తాజాగా తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!