Rape Case Filed Against Jani Master : లైంగిక వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు.
ఇప్పటి సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇంత సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నా కొంతమంది బుద్ధి మాత్రం ఏమాత్రం మాడం లేదు. తాజాగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై లైగింగ కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడాంటూ ఓ ప్రముఖ లేడీ కొరియో గ్రాఫర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జానీ మాస్టర్..తెలుగుతోపాటు తమిళ సినీ ఇండస్ట్రీలో డ్యాన్సర్ మాస్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఆయనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. తనను జానీ మాస్టర్ లైగింకగా వేధించాడంటూ ఓ ప్రముఖ మహిళ కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్ కొంతకాలంగ తనను లైగింకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్, ముంబై, చెన్నై సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ కు వెళ్లినప్పుడల్లా ఆ తర్వాత నార్సింగిలో తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తర్వాత విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 , క్రిమినల్ బెదిరింపులు, స్వచ్చందంగా గాయపర్చడం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఓ కాలేజీలో మహిళాపై దాడి కేసులో 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. బెయిల్ పై విడుదలయ్యాక కూడా జానీ మాస్టర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదని తన ఫిర్యాదు లో పేర్కొంది సదరు మహిళ.