Ather Energy IPO | ముంబయి: దేశీయంగా మరో ఎలక్ట్రిక్ వాహన సంస్థ పబ్లిక్ ఇష్యూకు (IPO) రాబోతోంది. హీరో మోటోకార్ప్ మద్దతు కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy IPO) ఐపీఓకు సిద్ధమైంది.
ఈమేరకు సెబీకి ఐపీఓ పత్రాలను సోమవారం సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.3,100 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్లు 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.
ఆఫర్ ఫర్ సేల్లో భాగంగా ప్రమోటర్లయిన తరుణ్ సంజయ్ మెహతా, స్వప్నిల్ బబన్లాల్ జైన్ 10 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వచ్చిన కొన్ని రోజులకే ఏథర్ కూడా ఐపీఓకు సిద్ధమవడం గమనార్హం. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయాలకు, మహరాష్ట్రలో కొత్త తయారీకేంద్రం ఏర్పాటుకు, ఆర్అండ్డీకి వెచ్చించనున్నారు. యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.