తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే..భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తప్పనిసరి అయితే తప్ప, దయచేసి బయటికి వెళ్లకండి అని కోరారు. భారీ వర్షాలని నేపద్యంలో చిన్నారులు మరియు వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచనలు చేశారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజా ప్రతి నిధులు అప్రమత్తంగా ఉండి, సహాయచర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి కోరారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేయాలని సూచనలు చేశారు. కాగా.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.