హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీని ప్రశంసించారు. ఉక్రెయిన్‌కు మానవతా సాయం, శాంతికి పిలుపునివ్వడంపై అభినందించారు.
పోలాండ్, ఉక్రెయిన్‌లో ఆయన పర్యటన వివరాలు తెలుసుకున్నానని ట్వీట్ చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి పరిరక్షణకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, క్వాడ్ సహా ఇతర ప్రాంతీయ కూటముల్లో పరస్పరం సహకరించుకుంటాం అన్నారు. అయితే వారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేదని వైట్‌హౌస్ ప్రకటించింది.